ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు

రిపోర్టర్: విజయ్ స్థలం: Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు, సారెను సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సీఎం ప్రార్థించారని వెల్లడించారు.