మండలిలో పాట ద్వారా పాలిటెక్నిక్ సమస్యలపై గోరెటి వెంకన్న గళం
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనమండలిలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై తనదైన శైలిలో పాట రూపంలో గళమెత్తారు. ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతూ ఆయన మండలిలో పాడిన పాట ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యారంగం, ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో ఆయన చేసిన ఈ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.