పలాసలో విశ్వకర్మ జయంతి వేడుకల ఘనత చాటుతూ భారీ బైక్ ర్యాలీ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ద్విచక్రవాహనాలపై జెండాలు చేతబూని తరలివచ్చారు. జై విశ్వకర్మ అంటూ చేసిన నినాదాలతో పలాస వీధులు మారుమ్రోగాయి. జగదుత్పత్తికి మూలకారకుడైన భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అత్యంత ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.