అమెరికాలో క్యాన్సర్తో పోరాడుతున్న యువకుడికి అండగా ఉంటామన్న నారా లోకేశ్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
అమెరికాలో క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న పులిపాటి భరత్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ సోదరితో తాను ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. భరత్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని, వైద్య బృందాల సూచనల మేరకు తగిన సహాయం అందిస్తామని మంత్రి భరోసానిచ్చారు.