స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇది దళితులకు, నాలుగు కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.