బ్రిటన్ రాకపై స్పందించిన ప్రిన్స్ హ్యారీ గత కొన్ని వారాలు ఈవెంట్ ఫుల్

రిపోర్టర్: వెంకట్ స్థలం: బ్రిటన్

బ్రిటన్‌కు తమ కుటుంబం తిరిగి రావడంపై ప్రిన్స్ హ్యారీ తాజాగా స్పందించారు. సెప్టెంబర్ 17న జరిగిన ఇన్విక్టస్ స్పిరిట్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గడిచిన కొన్ని వారాలు ఎంతో ఈవెంట్ ఫుల్‌గా సాగాయని తెలిపారు. బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, తమ పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని హ్యారీ పేర్కొన్నారు. అయితే ఈవెంట్ ఫుల్ అంటే ఏమిటనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.