ఖానాపూర్ సీఐని కలిసిన దస్తురాబాద్ కాంగ్రెస్ నాయకులు

రిపోర్టర్: Gone Rachana స్థలం: దస్తురాబాద్

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖానాపూర్ సీఐ కటకం సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

మండలంలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఐ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోక శరత్ రెడ్డి, దాసరి సత్తయ్య, ముడికే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.