బీహార్‌లో విషాదం నీట మునిగి చిన్నారుల మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: భాగల్‌పూర్
బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ బ్లాక్ పరిధిలో గల ఉడాడి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన పది నుంచి పదమూడేళ్ల వయసు గల పన్నెండు మంది చిన్నారులు లోతైన ప్రాంతంలో చిక్కుకుని నీట మునిగారు. చిన్నారుల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారక ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.