పండుగ వేళ గృహోపకరణాల ధరల పెంపునకు కమల్ నంది స్పష్టత

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

అక్టోబర్ ఒకటి నుంచి గృహోపకరణాల ధరలు పెరగనున్నట్లు గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ అధికారి కమల్ నంది తెలిపారు. ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలను ఐదు నుంచి ఏడు శాతం వరకు పెంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పండుగ సీజన్లో వినియోగదారులపై అదనపు భారం పడనుందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.