మత సామరస్యానికి ప్రతీకగా ఒడిశాలో దుర్గాదేవి విగ్రహాల అలంకరణ పనులు

రిపోర్టర్: విజయ్ స్థలం: కటక్

మత సామరస్యానికి ప్రతీకగా ఒడిశాలోని కటక్లో ముస్లిం కళాకారులు దుర్గాదేవి విగ్రహాల అలంకరణ పనులు చేస్తూ భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు. కళాకారుడు సయ్యద్ అస్లాం అలీ కుటుంబం తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని, ముస్లింలమైనా తమకు అమ్మవారిపై గాఢమైన విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. ఈద్ పట్ల ఎంత ఉత్సాహం ఉంటుందో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పట్ల కూడా అంతే ఉత్సాహం ఉంటుందని, ఎలాంటి విభేదాలు లేకుండా హిందూ, ముస్లింలు పండుగలను కలిసి జరుపుకుంటామని ఆయన వెల్లడించారు.