హైదరాబాద్ శంషాబాద్లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో తమ వ్యాపార పరిధిని విస్తరిస్తూ శంషాబాద్లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖను ప్రారంభించినట్లు ఎండీ మరియు సీఈఓ పంకజ్ గాడ్గిల్ తెలిపారు. ఈ కొత్త శాఖతో రాష్ట్రంలో మొత్తం శాఖల సంఖ్య పదమూడుకి చేరిందని ఆయన పేర్కొన్నారు. సొంతింటి కల సాకారం చేసేలా సులభతరమైన గృహ రుణాలు అందిస్తున్నామని, లాగిన్ ఫీజులు లేకుండా యాభై లక్షల వరకు తక్షణ రుణ మంజూరు ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.