'అత్యధికంగా 16వ సారి శ్రీవారికి పట్టువస్త్రాలు': తిరుమలలో సీఎం చంద్రబాబు రికార్డు

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరుపతి

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు సంప్రదాయ వస్త్రధారణతో బేడీ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో ఆనందనిలయుడికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో అత్యధికంగా 16వ సారి పట్టువస్త్రాలు సమర్పించిన ఏకైక నేతగా అరుదైన రికార్డు సృష్టించారు.