ఓబులవారిపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాయి కిషోర్ రెడ్డి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలంలో స్థానిక సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని జడ్పీటీసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల భారీ విజయానికి సహకరించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుంటూ ప్రజా సమస్యలపై విసృ్తతంగా చర్చలు జరుపుతూ ఓట్లు అభ్యర్థించారు.