ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం చేసినట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. అమరావతిలోని హైకోర్టు భవనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు. జస్టిస్ తూట చంద్ర ధన శేఖర్, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ చల్లా గుణ రంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.