షారుఖ్, అజయ్ దేవగన్ ప్రకటనల వివాదంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
విమల్ ఇలాచీ ప్రకటనల వివాదంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ తయారీ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రాదేశిక అధికార పరిధిపై తన తీర్పును రిజర్వ్ చేసింది. మహారాష్ట్రలో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారంటూ ఎఫ్‌డీఏ ఈ నోటీసులు జారీ చేసింది.