డీఎస్సీ టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ చంద్రబాబు హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: కుప్పం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం బహిరంగ సభలో తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులు చేయడం సరికాదని, టీచర్లపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియామకాలపై అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప దాడులు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, రౌడీయిజంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.