శంఖవరం బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ప్రత్తిపాడు
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో పీహెచ్సీ నుంచి వివిధ ప్రాంతాలకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి మూడు వేర్వేరు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.