నోయిడాలో ఇంట్లోనే కుంకుమపువ్వు పండించిన రిటైర్డ్ ఇంజనీర్!
రిపోర్టర్: రాము
స్థలం: ఉత్తర ప్రదేశ్
కాశ్మీర్లోనే పండే కుంకుమపువ్వును నోయిడాకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ రమేష్ గేరా తన ఇంట్లోనే విజయవంతంగా పండించారు. ఎలాంటి వ్యవసాయ భూమి లేకుండా కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, ఆధునిక సాంకేతికత సహాయంతో ఇండోర్ ఫార్మింగ్ ద్వారా కుంకుమపువ్వు సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వినూత్న వ్యవసాయ పద్ధతిపై ఇతరులకు కూడా ఆయన శిక్షణ ఇస్తున్నారు.