మణిపూర్ లో తీవ్ర ఉద్రిక్తత: ఇద్దరు యువకుల మృతదేహాల లభ్యంతో కాంగ్పోక్పిలో ఘర్షణలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: మణిపూర్

మణిపూర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవ్వడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగి హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నట్లు మణిపూర్ పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అదృశ్యమైన పోగిన్లాల్ హంగ్సింగ్, టింగిన్లున్ చోంగ్లోయ్ మృతదేహాలను ఉమ్మడి భద్రతా బలగాలు శనివారం రికవరీ చేశాయి. ఈ మరణాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజన ఐక్యతా కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. మృతదేహాలను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో నిరసనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టడంతో పాటు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.