జలవనరులు కలుషితం చేస్తే చర్యలు తప్పవంటూ పవన్ కల్యాణ్ హెచ్చరిక
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Mangalagiri
ఆక్వా వ్యర్థాల కారణంగా జలవనరులు కలుషితం కాకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. శుద్ధి చేయని వ్యర్థాలతో నదులు, కాలువలు కాలుష్యం బారినపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.