చెత్త ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ రేవంత్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రొఫెసర్లు, ల్యాబ్స్, రవాణా సౌకర్యాలు కరవయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను హౌస్ అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, మెడికల్ విద్యార్థుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు.