అమెరికాలో వైభవంగా దేవీ శరన్నవరాత్రులు: శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్లో ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Virginia
అమెరికాలోని వర్జీనియా ఫేయిర్ ఫాక్స్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర లోటస్ టెంపుల్లో దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రారంభమైనట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. తొలి రోజు అమ్మవారిని ఆది లక్ష్మీ రూపంలో కొలిచి నారింజ రంగు వస్త్రాన్ని ధరింపజేశామన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చాదికాలు, లలితా సహస్ర నామ పారాయణం, సంగీత నృత్య సేవలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.