డక్కిలి మండలంలో సమస్యలు పరిష్కరిస్తానంటూ సైకిల్ అభ్యర్థి ఇంటింటా ప్రచారం
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఎంపీటీసి అభ్యర్థి పాయసం కోటి రామాపురం తోపుగానపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గెలుపొందిన వెంటనే అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పాయసం కోటి ప్రజలకు హామీ ఇచ్చారు.