ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా ఝళిపించిన రామగుండం పోలీసులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
చలికాలంలో పొగమంచు వల్ల పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచిర్యాల, శ్రీరాంపూర్, క్యాతనపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 220 వాహనాలకు రూ.1.20 లక్షల జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పొగమంచు వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.