అంగన్వాడీలను వేధించిన ఐసీడీఎస్ పీడీ, సీడీపీవో సస్పెన్షన్!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలను వ్యక్తిగతంగా దూషిస్తూ, వేధింపులకు గురిచేసిన ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, కోవూరు ఇన్ఛార్జి సీడీపీవో శారదలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 'మీ తోకలు కత్తిరిస్తా, తాటతీస్తా' అంటూ సీడీపీవో బెదిరింపులకు పాల్పడటంతో పాటు, పోస్టుల భర్తీలో పీడీ అవినీతికి పాల్పడ్డారన్న అంగన్వాడీ సంఘాల ఆధారాలతో కూడిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఈ శాఖాపరమైన సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.