సంచలన వీడియో: కళ్లకు పెప్పర్ స్ప్రే కొట్టించుకున్న యుఎఫ్ సీ ఫైటర్
రిపోర్టర్: వెంకట్
స్థలం: New York
రాబోయే హెవీవెయిట్ టైటిల్ పోరు కోసం అమెరికా ఫైటర్ జోష్ హోకిట్ వినూత్న రీతిలో శిక్షణ పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. తన ప్రత్యర్థి సిరిల్ గెనే గతంలో చేసిన వివాదాస్పద కంటి దాడిని ఎద్దేవా చేస్తూ, జోష్ హోకిట్ తన కళ్లకు పెప్పర్ స్ప్రే కొట్టించుకుని ప్రాక్టీస్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసినట్లు ఆ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ విపరీతమైన శిక్షణ వీడియో ప్రస్తుతం క్రీడా వర్గాల్ లో తీవ్ర కలకలం రేపుతోంది.