ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై దారుణంగా గ్యాంగ్ రేప్
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కల్కాజి మందిర సమీపంలోని పార్కులో పదిహేడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తాము పోలీసులమని చెప్పి ఈ అరాచకానికి ఒడిగట్టారు. నిందితుల అరెస్టుకు యత్నించిన సమయంలో పోలీసులపై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.