అజామ్ ఖాన్ బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు: హైకోర్టుకు వెళ్లాలని స్పష్టీకరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జేడీ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినట్లు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్ లో భాగంగానే తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అజామ్ ఖాన్ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి.