సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి: బీజేపీ నేతల పిలుపు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
అంబాజీపేటలో బుధవారం జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ ఐనవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుమర్తి బేబీ రాణి పిలుపునిచ్చారు. ముక్తేశ్వరంలో జరిగిన సమావేశంలో వారు ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సీఎం పర్యటనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.