సారపాకలో భారీ కార్డెన్ సెర్చ్: పత్రాలు లేని వాహనాల స్వాధీనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పారిశ్రామిక ప్రాంతంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితుల వివరాలు సేకరించడంతో పాటు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా డీఎస్పీ సతీశ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.