తిరుమల భక్తులకు తీపి కబురు: రేపు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పద్దెనిమిది, పంతొమ్మిది, ఇరవై తేదీలకు సంబంధించిన టికెట్లను కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు.