హక్కుల పోరును తొక్కిపెట్టే పోలీసుల నిర్బంధపు ఉక్కుపాదం

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలోని కడ్తాల్లో గిరిజన విద్యార్థి సంఘం, ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న గిరిజన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాత్లావత్ సుమన్ నాయక్ మాట్లాడుతూ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. సేవాలాల్ మహారాజ్ జయంతికి ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, జీవో 641 రద్దు చేసి గిరిజన భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. తండాలను పంచాయతీలుగా మార్చాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.