విద్యార్థులకు గుడ్ న్యూస్: జాతీయ విద్యా వెబ్సైట్లో స్కాలర్షిప్ల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరియు రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల దరఖాస్తులకు అక్టోబర్ 31, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ నవంబర్ 15 లోపు పూర్తి కావాలని, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.