హిందీపై శివరాజ్‌కుమార్ వ్యాఖ్యలు తీవ్ర వివాదం

రిపోర్టర్: హరి స్థలం: కర్ణాటక

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హిందీ జాతీయ భాష అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒరిజినల్ మాన్‌స్టర్ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హిందీ మన జాతీయ భాష అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, అభిమానులు మాత్రం ఆయనను సమర్ధిస్తున్నారు.