విషాదం: ఉమ్మడి రాష్ట్ర విశ్రాంత రెవెన్యూ కార్యదర్శి రోశయ్య కన్నుమూత

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ కార్యదర్శిగా సేవలందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.సి.రోశయ్య బుధవారం కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ సోమాజిగూడలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించారు. 1984లో ఏపీ ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులో చేరి వివిధ హోదాల్ లో సేవలు అందించిన ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.