రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆటకు వయసు అడ్డంకి కాదన్న బీసీసీఐ అధ్యక్షుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటంపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ స్పష్టతనిచ్చారు. జట్టు ఎంపికలో వయసు అనేది అస్సలు అడ్డంకి కారాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటగాడి ఫిట్నెస్, ఆటతీరు మాత్రమే ప్రామాణికాలు కావాలని మన్హాస్ స్పష్టం చేశారు. ఒక ఆటగాడు ఫిట్గా ఉండి దేశం కోసం మ్యాచ్లను గెలిపిస్తుంటే, ఆ ఒక్క అంశంపైనే మనం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.