అమెరికా కలలు వాస్తవాలపై ఘనంగా నాట్స్ అవగాహన సదస్సు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

అమెరికాలో తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో అమెరికా కలలు, వాస్తవాలు అనే శీర్షికతో నిర్వహించిన ఆన్‌లైన్ అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ప్రముఖ ఎమోషనల్ ఇంటిలెజెన్స్ కోచ్ భారతీ నాదెండ్ల ముఖ్య అతిథిగా విచ్చేసి అమెరికాలోని జీవన శైలి, సవాళ్లు, మానసిక సిద్ధతపై విలువైన సూచనలు చేశారు. నాట్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించగా నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ నిర్వాహకులను అభినందించారు.