యువత సమస్యలపై ఇందోర్లో రాహుల్ గాంధీ ప్రత్యేక సంభాషణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఇందోర్
మధ్యప్రదేశ్లోని ఇందోర్లో జరిగిన ఛత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువతతో ముఖాముఖి సంభాషించారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, పేపర్ లీకేజీలు మరియు నియామకాల్లోని జాప్యంపై విద్యార్థుల నుంచి ఆయన నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యువత ఎదుర్కొంటున్న సవాళ్లను దేశం వినాల్సిన అవసరం ఉందని, వారి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.