మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా
రిపోర్టర్: అశోక్
స్థలం: దుబాయ్
దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ తొలి సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ అజేయ ఇన్నింగ్స్‌తో రాణించగా, దీప్తి శర్మ బౌలింగ్‌లో సత్తా చాటారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.