'జ్ఞానజ్యోతిని ప్రసాదించే హంస వాహనంపై మలయప్ప స్వామి దర్శనం': తిరుమలలో బ్రహ్మోత్సవాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే ఈ వాహనసేవలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి తదితరులు పాల్గొనగా, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.