సోషల్ మీడియా ప్రాంక్ వేధింపులు: ఆన్లైన్ ఆర్డర్లతో సతమతమవుతున్న యు శేఖర్ కొడంగల్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

సోషల్ మీడియా ప్రాంక్ వేధింపులతో నటనమ్ స్టార్ యు శేఖర్ కొడంగల్ తీవ్రంగా సతమతమవుతున్నారని ఆయన వెల్లడించారు. కొందరు వ్యక్తులు తన ఫోన్ నంబర్లను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసి, ఈ-కామర్స్ యాప్ల ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో విపరీతమైన వస్తువులను ఇంటికి ఆర్డర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ వరుసగా వస్తువులు తెస్తుండటంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని, ఎవరూ ఎలాంటి ఆర్డర్లు తేవద్దని స్పష్టం చేశారు.