వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిన సౌత్ ఆమలూరు కుటుంబాలు

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆమలూరు గ్రామానికి చెందిన యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు పార్టీ వైపు వస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.