రాష్ట్రంలో కొత్త పార్టీ ప్రకటన: విజయవాడ వేదికగా విజయసాయిరెడ్డి సంచలనం

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు దీటుగా మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నెల పదకొండవ తేదీన విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు ఒ.వి.రమణతో కలిసి విజయవాడలోని ప్రెస్క్లబ్ లో ఆయన సోమవారం మాట్లాడారు. తమ పార్టీలో చేరేందుకు అన్ని జిల్లాల నుంచి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.