తిరుమలలో అత్యంత వైభవంగా ముగిసిన చక్రస్నాన మహోత్సవం

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజున సుదర్శన చక్రత్తాళ్వార్లకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా అర్చకులు ఈ పవిత్ర ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు.