గుమ్మడికొండలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి నేతలు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
అనకాపల్లి జిల్లా నర్సిపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గుమ్మడికొండ పంచాయతీలో నిర్వహించిన ఈ ప్రచారంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లెక్కలు సన్యాసి నాయుడు అలియాస్ బాబులతో పాటు ఎంపీటీసి అభ్యర్థి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలను కలుస్తూ తమ కూటమికి మద్దతు తెలపాలని వారు విస్తృతంగా అభ్యర్థించారు.