ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల పాలన
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌ల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో ఆ పరిపాలనా బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగనుండగా మండలాలకు ఆర్డీవోలు, జెడ్పీలకు కలెక్టర్లు ఇన్ఛార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్‌లుగా పునర్వ్యవస్థీకరిస్తూ ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు.