బెంగళూరు విమానాశ్రయంలో అరుదైన ఘటన: అపరిచితుడికి చిన్నారి చెయ్యి అందించిన తల్లి

రిపోర్టర్: వెంకట్ స్థలం: బెంగళూరు

భారతదేశంలో అపరిచితులపై ఉండే నమ్మకానికి నిదర్శనంగా బెంగళూరు విమానాశ్రయంలో ఒక హృదయాలను హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. రచయిత సదానంద్ ధూమే ఎక్స్ వేదికగా ఈ అనుభవాన్ని పంచుకున్నారు. విదేశాల నుండి రాగానే ఎస్కలేటర్ ఎక్కుతున్న సమయంలో ఒక తల్లి తన చిన్నారి కూతురి చెయ్యిని ఆయన చేతిలో పెట్టి భద్రతగా పట్టుకోమని కోరింది. ఎలాంటి భయాలు లేకుండా ఇతరులపై ప్రజలు ఉంచే ఈ అపారమైన విశ్వాసం ఎంతో మనసును తాకిందని ఆయన ఆవేదనతో పాటు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.