బాలీవుడ్లో శ్రీలీలకు మరో భారీ ఆఫర్: రొమాంటిక్ థ్రిల్లర్లో నటిస్తున్న వైనం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
దక్షిణాదిలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ నటి శ్రీలీల బాలీవుడ్లో వరుసగా అగ్రశ్రేణి చిత్రాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న ఈ భామ, తాజాగా సిద్ధార్థ్ గుప్తా హీరోగా ఉమేశ్ బిష్త్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాన్వీ కపూర్ తో కలిసి ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.