తిరుపతి మహిళ అద్భుత విజయం: విదేశాలకు పేపర్ బ్యాగుల ఎగుమతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిరుపతి
పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచనతో తిరుపతి జిల్లా కరకంబాడికి చెందిన కె. హేమావతి సన్ పేపర్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ బ్యాగుల తయారీ పరిశ్రమను స్థాపించారు. లక్ష రూపాయల పెట్టుబడితో ఇద్దరితో ప్రారంభమైన ఈ వ్యాపారం, నేడు ఇరవై మందికి ఉపాధి కల్పిస్తూ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని వ్యవస్థాపకురాలు హేమావతి తెలిపారు. భర్త సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆమె నెలకు ఆరు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.