'కోవూరులో నారా లోకేష్ ఘన స్వాగతం': ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో మంత్రి నారా లోకేష్‌కు ప్రజలు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బైపాస్ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.